బ్రెయిన్ ట్యూమర్.. ఈ లక్షణాలు కనిపిస్తే వేరీ డేంజర్!
మెదడులో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల కణితులు ఏర్పడతాయి. దీన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటాం.
By - అంజి |
బ్రెయిన్ ట్యూమర్.. ఈ లక్షణాలు కనిపిస్తే వేరీ డేంజర్!
మెదడులో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల కణితులు ఏర్పడతాయి. దీన్నే బ్రెయిన్ ట్యూమర్ అంటాం. ఈ కణితులకు కారణం క్యాన్సర్ కావొచ్చు, కాకపోవచ్చు.. అయితే ఈ కణితులు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయడంతో పాటు భవిష్యత్తులో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. ఈ కణితులు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయో ఇప్పుడు చూద్దాం..
బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వారిలో సగం మందికి తలనొప్పి వస్తుంటుంది. చేతులు లేదా కాళ్లలో తిమ్మిరి, మూర్ఛ, వినికిడి లోపం, దృష్టి లోపం, జ్ఞాపకశక్తి కొల్పోవడం, నడుస్తున్నప్పుడు తల తిరుగుతున్న భావన వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్త్రీలలో పీరియడ్స్ వచ్చే సమయంలో హెచ్చు తగ్గులు, అసాధారణ ప్రవర్తన వంటివి ఉంటాయి. ఇవి కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడే అవకాశం ఉంది.
ఈ లక్షణాలు కనిపిస్తాయి
కొంత మంది బాధితుల్లో మెదడు కణితుల్లో రక్తస్రావం అవుతుంది. దీని వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అనేక రకాల దృష్టి సమస్యలు వస్తాయి. దృష్టి పాక్షికంగా తగ్గుతుంది. కొందరిలో సమస్య తీవ్రమైతే దృష్టిని కొల్పోతారు. కొందరికి ప్రతి వస్తువూ రెండుగా కనిపిస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడేవారి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. వారు ఏ పనీ సరిగా చేయలేరు. పని పట్ల నిరాసక్తత, గందరగోళం వంటివి కనిపిస్తాయి.
హర్మోన్ల విడుదలలో అసమతులత్య కనిపిస్తుంది. దీని వల్ల స్త్రీలలో రుతుక్రమంలో మార్పులు, సంతానలేమి, ఎదుగుదల లోపం, థైరాయిడ్ సమస్యలు మొదలైనవి కనిపిస్తాయి. కొందరికి మెదడు వెనుక భాగంలో కణితి ఏర్పడితే వారు నడిచే విధానంలో చాలా తేడా కనిపిస్తుంది.
బ్రెయిన్ ట్యూమర్ కొందరిలో వినికిడి లోపానికి దారి తీస్తుంది. వికారం, వాంతులు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు సరిగా మాట్లాడలేరు. భాషను మరిచిపోతుంటారు.