కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయి. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బలి తీసుకుంటోంది. గుండెపోటు వచ్చిన వ్యక్తుల విషయంలో డాక్టర్లు గోల్డెన్ అవర్ అనే పదాన్ని వాడుతుంటారు. దీని ప్రాధాన్యత ఏమిటో చూద్దాం..
గుండెపోటు వచ్చిన తర్వాత ఒక గంట సమయాన్ని 'గోల్డెన్ అవర్' అంటారు. ఆ సమయంలో రోగికి ఇచ్చే ప్రథమ చికిత్స అతడి ప్రాణాలను కాపాడుతుంది. గుండెపోటు బారిన పడిన వ్యక్తికి గంట లోపు వైద్య సహాయం అందించడం ముఖ్యం. గుండెపోటును గుర్తించిన వెంటనే సీపీఆర్ చేయడం, కృత్రిమ శ్వాస అందించడం వల్ల ఆ వ్యక్తి ప్రాణాన్ని 60 నుంచి 70 శాతం వరకు కాపాడే అవకాశం ఉంటుంది.
ఇలా చేయడం వల్ల గుండె పూర్తిగా ఆగిపోకుండా తిరిగి కొట్టుకునే అవకాశాలు పెరుగుతాయి. రోగి కూడా అస్మారక స్థితికి చేరకుండా ఉంటారు. అంబులెన్స్‌కు వెంటనే సమాచారం ఇచ్చి వచ్చిన వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. శ్వాసలో ఇబ్బంది, ఛాతి దగ్గర తీవ్రమైన నొప్పి, భారంగా అనిపించడం, అలసట, చెమటలు విపరీతంగా పట్టడం, మైకం కమ్మడం ఇవి గుండెపోటు రావడాన్ని సూచిస్తాయి.