ఆ సుఖాన్ని మహిళలు పొందలేకపోతున్నారట..
By అంజి Published on 31 March 2020 1:16 PM GMTకాలం మారుతోంది. దాంతో పాటు సాంకేతిక కూడా పెరుగుతోంది. దీంతో చాలా మంది చిన్న వయస్సులో శృంగారం గురించి తెలుసుకుంటున్నారు. ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చాక స్త్రీ, పురుష లైంగిక వ్యవస్థపై చాలా మంది ఒక అవగాహనకు వస్తున్నారు. శృంగారానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే శృంగారం సమయంలో స్త్రీ, పురుషులు అనుభవించే సుఖంలో చాలా తేడాలు ఉన్నాయట. పురుషులు అనుభవించినంత తృప్తిని స్త్రీలు పొందలేకపోతున్నారట. మహిళల్లో భావప్రాప్తికి కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. పురుషులు భావప్రాప్తి పొందేందుకు పరిమిత వనరులను ఉపయోగించుకుంటారు. పడకగది విషయానికి వచ్చే సరికి దాదాపుగా పురుషుడిదే పైచేయిగా ఉంటుంది. స్త్రీలు పై చేయి సాధించాలనుకున్నా కొన్ని కారణాలతో వెనక్కు తగ్గుతారని తెలిసింది. శృంగారం సమయంలో పెత్తనం చూపిస్తే.. ఆ తర్వాత పురుషుడు మానసికంగ వేధించే అవకాశాలంటాయన్న కారణంతో మహిళలు తమ కోరికలను అణిచిపెట్టుకొని ఉంటున్నారని తాజా అధ్యయనంలో తెలిసింది. కొందరు మహిళలు మాత్రం వారు పెరిగిన వాతావరణం, సంస్కృతి తగ్గ ప్రవర్తిస్తున్నారట.
శృంగారం అనేది ఒక కళాత్మక అనుభవం అవని శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు అంటున్నారు. అలాంటి సంభోగ ప్రక్రియలో పురుషుడు తన తృప్తి కోసమే పాకులాడుతున్నాడట. తనతో పాల్గొన్న భాగస్వామికి తృప్తి కలిగిందా? లేదా? అని పురుషుడు పట్టించుకోవడం లేదని తెలిసింది. ప్రస్తుతం మహిళల భావప్రాప్తి అనేది తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉందని సెక్సవల్ వెల్‌నెస్ బ్రాండ్ కే-వై అధికార ప్రతినిధి, సెక్స్ నిపుణురాలు జెన్నీపర్ వైడర్ తెలిపారు.
శృంగార సమయంలో మహిళలు ఎలా ఉద్రేకానికి గురి అవుతారన్న విషయాలను ప్రతి పురుషుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మెడపై తాకడం, చేతి మునివేళ్లతో స్పర్శించడం వంటి పనులు చేస్తూ మహిళలను ఉద్రేకపరచాలి. అప్పుడే వారు కొంతైన తృప్తి పడే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మహిళలను తృప్తి పరచడానికి ఎలాంటి ఫార్ములాలు లేవని, శరీరానికి తగ్గట్లు వ్యవహరించుకుపోవడమేనని మేక్ లవ్ నాట్ పోర్న్ చీఫ్ సిండీ గలాప్ అన్నారు.