ఢిల్లీలో కాలుష్య స్థాయి నానాటికీ ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించింది. నవంబరు 5వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. మరోవైపు కాలుష్యం దృష్ట్యా నవంబరు 5వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

Image result for delhi health emergency"

​అధికారిక డేటా ప్రకారం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే ‘బాగుంది’ అని, 51-100 మధ్య ఉంటే ‘సంతృప్తికరం’ అని, 101-200 మధ్య ఉండే ‘మధ్యస్తం’, 201-300 అయితే ‘బాగోలేదు’, 301-400 అయితే ‘ఏమాత్రం బాగోలేదు’, 401-500 మధ్య అయితే ‘ప్రమాదకరం’, 500పైన ఉంటే ‘ప్రమాదకరం-ప్లస్‌ ఎమర్జెన్సీ’గా పరిగణిస్తారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.