ట్రోలర్స్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన షమీ భార్య
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 11:15 AM ISTమహ్మద్ షమీ భార్య హసీన్ జహన్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను తిప్పి కొట్టింది. మోడల్, నటి అయిన హసీన్ ఇటీవల ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అయితే.. డ్యాన్స్ చేస్తూనే తన అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. ఇది చూసిన నెటీజన్లు ఆమెపై ట్రోలింగ్‌కు దిగారు. మతాన్ని ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోశారు. ఇస్తాం నిబంధనలకు విరుద్దంగా ఇలా డ్యాన్స్ చేయడం ఏమిటి ప్రశ్నించారు. ఆమె దుస్తులపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వల్లే షమీ చాలా మానసిక వేదనకు గురి అయ్యాడని.. వెంటనే షమీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే.. ఈ ట్రోలింగ్‌ను హసీన్ తిప్పికొట్టింది. ఎవరు ఏం చెప్పినా తాను వినని అంటూ తెలిపేలా ఆమె పొట్టి దుస్తులతో డ్యాన్స్ చేసిన వీడియోలను షేర్ చేసింది. ట్రోలర్స్‌ను అరిచే కుక్కలతో పోలుస్తూ.. అరిచే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని, మన పని మనం చేసుకోవాలని అని కామెంట్ చేసింది. కాగా.. భారత పేసర్ మహ్మద్ షమీతో 2014లో హసీన్ వివాహాం జరగగా.. కొన్ని గొడవల కారణంగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు.
కాగా.. దాదాపు రెండేళ్ల క్రితం హాసిన్ జహాన్.. మహ్మద్ షమీపై పోలీసులకు ఫిర్యాద్ చేయడంతో పాటు అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి ప్రవేశించాడని ఆరోపించింది. ఈ ఆరోపణలపై స్పందించిన బీసీసీఐ వెంటనే రంగంలోకి దిగి షమీపై విచారాణ జరిపింది. షమీ ఎటువంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదని క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా.. ఇటీవల రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న షమీ ఈ వీషయాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందాడు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవడంతో పాటు వ్యక్తిగత విషయాలు మీడియాలో వైరల్ కావడంతో మూడు సార్లు ఆత్మహత్యకు చేసుకోవాలని అనుకుట్లు చెప్పాడు. అయితే.. కుటుంబ సభ్యుల మద్దతుతో ఆ ఆలోచనల నుంచి బయటపడినట్లు చెప్పాడు.