హర్యానా: హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైనట్లు సమాచారం. హర్యానాకు చెందిన కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉదయం ఢిల్లీలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అనంతరం తమ మద్దతు బీజేపీకేనని ప్రకటించారు. ఖట్టర్‌ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీకి ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మేజిక్ మార్క్‌ 46. అయితే..బీజేపీ 40 సీట్లు మాత్రమే గెలుచకుంది. కాకపోతే అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఏడుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తుండటంతో ..ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలనాధులు ముందుకు వెళ్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.