కేకేఆర్ కు షాక్.. ఆ ఆటగాడు ఈ సీజన్ లో ఆడడం లేదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2020 3:54 PM IST
కేకేఆర్ కు షాక్.. ఆ ఆటగాడు ఈ సీజన్ లో ఆడడం లేదు..!

ఐపీఎల్ కు ఇంకొద్ది వారాలు మాత్రమే సమయం ఉండడంతో ఆటగాళ్లు, జట్టు యాజమాన్యాలు సమాయత్తమవుతూ ఉన్నాయి. తమ ఆటగాళ్లెవరికీ గాయాలు అవ్వకూడదని కోరుకుంటూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది.

కేకేఆర్ జట్టుకు 2020 ఐపీఎల్ మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ హ్యారీ గుర్నీ భుజంకు అయిన గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగాడు. కేకేఆర్ జట్టుకు ఉన్న ముగ్గురు విదేశీ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. గుర్నీ కాకుండా కేకేఆర్ జట్టుకు ఉన్న ఓవర్సీస్ ఫాస్ట్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, లోకీ ఫెర్గ్యూసన్ మాత్రమే..! వచ్చే నెలలో గుర్నీ భుజానికి ఆపరేషన్ చేయించుకోనున్నాడు. దీంతో తాను ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్, ఐపీఎల్ 2020కు దూరమవుతున్నానని స్వయంగా వెల్లడించాడు.

గుర్నీ కేకేఆర్ తరపున 8 మ్యాచ్ లు 2019 సీజన్ లో ఆడాడు. ఏడు వికెట్లు కూడా తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 2/25 ప్రదర్శన కనబరిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

మరో ఇంగ్లీష్ క్రికెటర్ కూడా ఐపీఎల్ నుండి వైదొలిగాడు. క్రిస్ వోక్స్ తాను ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడడం లేదని.. వ్యక్తిగత కారణాల వలన దూరమవుతున్నానని తెలిపాడు. 2019 ఐపీఎల్ ఆక్షన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ వోక్స్ ను సొంతం చేసుకుంది. వోక్స్ స్థానంలో సౌత్ ఆఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ట్జే ను ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది. కేకేఆర్ జట్టు గుర్నీ రీప్లేస్మెంట్ కోసం ఎదురుచూస్తోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్సమెంట్ ఇవ్వనుంది కేకేఆర్ జట్టు.

ఐపీఎల్- 2020 సీజన్ సెప్టెంబ‌ర్ 19వ తేదీన డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌డంతో మొదలవుతుంది. త్వరలోనే ఈ ఏడాది పూర్తీ షెడ్యూల్ రానుంది. అభిమానులను స్టేడియం లోకి అనుమతిస్తారా లేదా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి.

Next Story