టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. గాయంతో జాతీయ జట్టుకు దూర‌మైన పాండ్యా.. రీఎంట్రీ సిద్దంగా ఉన్నానంటూ బ్యాటుతో త‌న సిగ్న‌ల్‌ ప్రకటించాడు. వివ‌రాల్లోకెళితే.. డీవై పాటిల్‌ టీ20 టోర్న‌మెంట్‌లో బాగంగా ఎంట్రీ ఇచ్చిన పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 37 బంతుల్లో సెంచ‌రీ బాది విధ్వంసం సృష్టించాడు.

హార్దిక్‌ పాండ్యా.. డీవై పాటిల్‌ టీ20లో టోర్నిలో రిలయన్స్ 1 జ‌ట్టు తరఫున ఆడుతున్నాడు. కాగ్‌ (సీఏజీ)తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగాడు. సిక్సర్లు, బౌండరీలతో దుమ్మురేపాడు. ఏకంగా 10 సిక్సర్లు, 7 బౌండరీలు బాదాడు. పాండ్యా ధాటికి కాగ్‌ బౌలర్ల వ‌ద్ద స‌మాధానం లేక‌పోయింది. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో.. పాండ్య 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. పాండ్యా విధ్వంసంతో ఆ ఓవ‌ర్ వేసిన‌ కాగ్ బౌల‌ర్ వీ జీవరాజన్ దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయాడు. పాండ్యా విజృంభణతో రిలయన్స్‌ 1 జట్టు 20 ఓవర్లలో 252/5 ప‌రుగులు చేయ‌గా.. పాండ్యా 39 బంతుల్లో 105 పరుగులు చేశాడు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.