జూనియర్ హార్దిక్ వచ్చేశాడు.!
By Medi Samrat Published on 30 July 2020 5:32 PM ISTటీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. హార్దిక్ కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు బాబు చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు.
హార్దిక్ నటాషాలకు.. టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, కృనాల్ పాండ్యా కంగ్రాట్స్ తెలిపారు. అలాగే సచిన్ తనయ సారా టెండూల్కర్, బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ ఇలా పలువురు ప్రముఖులు కూడా హార్దిక్, నటాషా జంటకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలావుంటే.. నెటిజన్లు జూనియర్ హార్దిక్ వచ్చాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక హార్దిక్, నటాషా జోడి జనవరి 1వ తేదీ 2020న తమ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించింది. ఆ తర్వాత తల్లిదండ్రలు కాబోతున్న విషయాన్ని.. తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఎదురుచూస్తున్నట్టు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.