హిట్‌మ్యాన్‌కు రెస్ట్.. హార్ధిక్ పునరాగమనం
By తోట వంశీ కుమార్ Published on 8 March 2020 6:54 PM ISTదక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బీసీసీఐ ప్రకటించింది. గాయం కారణంగా దాదాపు ఆరు నెలల పాటు జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి ఎంపికయ్యాడు. ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పిక్క గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో విశ్రాంతి నిచ్చారు. బ్యాకప్ ఓపెనర్లుగా పృథ్వీషా, శుభ్‌మన్ గిల్‌లను ఎంపిక చేశారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. రిషభ్ పంత్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.
దక్షిణాఫ్రికాతో భారత్ ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లఖ్‌నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది.
జట్టు వివరాలు..
విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యార్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, పృథ్వీ షా, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చహల్, జస్‌ప్రీత్ బుమ్రా, నవీదీప్ సైనీ, కుల్‌దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్.