'హార్ధిక్‌ పాండ్యా 2.0' .. వీడియో వైర‌ల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Oct 2020 9:41 AM GMT
హార్ధిక్‌ పాండ్యా 2.0 .. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్థిక్ పాండ్యా తండ్రైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం హార్థిక్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే.. అత‌డి భార్య న‌ట‌సా స్టాంకోవిక్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. త‌న కుమారుడు బుల్లిపాండ్యా (ఆగ‌స్త్య‌)కు సంబంధించిన విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటోంది. తాజాగా నటషా.. తన రెండు నెలల చిన్నారి ఆగస్త్యతో ఆడుకుంటున్న వీడియోను సోమవారం షేర్‌ చేశారు.

ఇందులో ఆగస్త్యతో నటషా మాట్లాడుతూ ఉండే తన ముక్కపై పదే పదే కొడుతున్న వీడియోను రెడ్‌ హర్ట్‌ ఎమోజీ క్యాప్షన్‌తో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఆగస్త్య చాలా ముద్దుగా ఉన్నాడు’,‘హార్ధిక్‌ పాండ్యా 2.o’ అంటూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. నటషా తన మాతృత్వ మాధుర్యాని ఆస్వాదిస్తున్నారు.

హార్దిక్ పాండ్యా‌, నటషా చాలాకాలం ప్రేమించుకున్నారు. అప్పుడప్పుడు కలిసి పార్టీలు, పార్క్‌లకు వెళ్లేవారు. హఠాత్తుగా గతేడాది డిసెంబర్‌ 31 రాత్రి దుబాయ్‌లో సముద్ర జలాల్లో విహరిస్తూ నటాషాకు పాండ్యా నిశ్చితార్థపు ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే ఉన్నట్టుండి లాక్‌డౌన్‌లో అతడు మళ్లీ షాకిచ్చాడు. తన భార్య గర్భం దాల్చిందని చెప్పాడు. ఎవరినీ పిలవకుండా కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నట్టు ఆ తర్వాత తెలిసింది.

Next Story