ఈ సారి మాత్రం పక్కా.. కన్ఫర్మ్ చేశాడు..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Jan 2020 2:12 PM ISTటీమిండియా యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన జీవితానికి సంబందించి అతి ముఖ్యమైన విషయాన్ని బాహ్య ప్రపంచంతో షేర్ చేసుకున్నాడు. తన ప్రియురాలు ఎవరో రివీల్ చేశాడు. కొత్త సంవత్సరం వేడుకలలో ప్రియురాలితో సహా పాల్గొన్న హార్దిక్ పాండ్యా ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఒక పోస్టు చేశాడు.
సెర్బియా మోడల్ నటాషా స్టాన్‌తో హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడు. దీనికి సంబంధించి మొదటిసారిగా పాండ్యా.. ‘స్టార్టింగ్ ద ఇయర్ విత్ మై ఫైర్‌వర్క్’ అంటూ నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్ చేశాడు. గత కొంతకాలంగా పాండ్యా ప్రేమాయణం నడుపుతున్నాడని, వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వస్తున్న నేఫథ్యంలో పాండ్యా వాటన్నింటికి క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలావుంటే.. పాండ్యా ఇంతకుముందు కూడా చాలామంది అమ్మాయిలతో ప్రేయ కలాపాలు కొనసాగించాడు. అవి కొద్ది రోజులకే పరిమితం కాగా.. నటాషాతో మాత్రం సీరియస్ లవ్‌లో ఉన్నట్లు సమాచారం. పోయిన ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ హార్దిక్ పరిచయం చేశాడని అని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక నటాషా విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఐటమ్ గర్ల్‌గా అడుగుపెట్టింది. అనంతరం షారుక్ ఖాన్, అనుష్క నటించిన ‘జీరో’ మూవీలో ఓ కీలకపాత్రలో తళుక్కుమంది. అంతేకాకుండా హిందీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ‘నచ్ బలియే’లో కూడా నటాషా పాల్గొంది. ఈ విషయమై నటాషాకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా హార్దిక్ గతంలో తన అభిమానులను కోరాడు.
Hardik Pandya