దీపాలు వెలిగించమంటే..మరీ ఇంత మూర్ఖత్వమా ?
By రాణి Published on 6 April 2020 9:19 PM ISTఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దేశ వ్యాప్తంగా ప్రతి ఇంట్లో విద్యుద్దీపాలను ఆర్పివేసి మొబైల్ ఫ్లాష్ లైట్లను, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాల్సింది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి విధితమే. ప్రధాని పిలుపును గౌరవించిన భారతీయులంతా అలాగే దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు. కానీ దేశంలో కొంతమంది మాత్రం టపాసులు కాల్చుతూ తమ మూర్ఖత్వాన్ని చాటుకున్నారు. అరె దీపాలు వెలిగించమంటే..చిచ్చుబుడ్డిలు, భూ చక్రాలు, రాకెట్ బాంబ్ లు వేయడం ఏమిటని చాలా మంది పెదవి విరుపుగా మాట్లాడారు. ఇలా టపాసులు కాల్చడం వల్ల ఢిల్లీలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి.
Also Read : ఏపీలో విజృంభిస్తోన్న కరోనా..ఆ రెండు జిల్లాల్లో కేసులు నిల్
ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. అసలు ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తిస్తారు ? కరోనా వైరస్ కు ఖచ్చితంగా మందు కనిపెట్టగలం గానీ..ఇలాంటి మూర్ఖత్వానికి మాత్రం ఎప్పటికీ మందు కనిపెట్టలేం అని పేర్కొంటూ..గతరాత్రి ఢిల్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోనూ ట్వీట్ చేశారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం..అది ఆదివారం రాత్రి జరిగిన ఘటన కాదంటూ రిప్లైలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే..గౌతమ్ గంభీర్ కూడా టపాసులు పేల్చడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మనం ఇంకా కరోనా పై పోరాడుతున్నాం..టపాసులు పేల్చి పండుగ చేసుకోవడానికి ఇది సందర్భం కాదంటూ హితవు పలికారు.