నెమ్మదిగా ఆరంభిస్తాడు.. ఆ తరువాత..

By Newsmeter.Network  Published on  20 Feb 2020 6:23 AM GMT
నెమ్మదిగా ఆరంభిస్తాడు.. ఆ తరువాత..

కాలిపిక్క గాయంతో కివీస్‌ పర్యటన మధ్య నుంచి అర్థాంతంగా తప్పుకున్నాడు హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ. ప్రస్తుతం తన కుటుంబంతో కాలం గడుపుతున్నాడు. కాగా.. సోషల్‌మీడియాలో ఎల్లప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉంటాడు రోహిత్ శర్మ. తాజాగా జిమ్‌లో బరువులు ఎత్తుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు హిట్‌మ్యాన్‌. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌.. రోహిత్‌ను ట్రోల్‌ చేశాడు. ఇందుకోసం 'కేవలం 40 కిలోలేనా..?' కమాన్‌ అంటూ కామెంట్ చేశాడు.

దీనికి రోహిత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.. 'గాయపడ్డ తర్వాత బరువులెత్తడం ఇదే తొలిసారి.. అందుకే ఇలా'..అని రిప్లై ఇచ్చాడు. వీరిద్దరు ఒకప్పుడు కలిసి ఆడడంతో సరదాగా సంభాషించుకున్నారు. ఇదిలా ఉంటే.. హర్భజన్‌ వ్యాఖ్యలకు కొందరు నవ్వి ఉరుకోగా.. మరికొందరూ ఘాటుగా స్పందించాడు. రోహిత్.. 100 నుంచి 200కు 32 బంతుల్లో చేరుకోగలడు.. నెమ్మదిగా ఆరంభిస్తాడు అని ఓ నెటీజన్‌ కామెంట్ చేయగా.. 40కిలోలే ఎత్తినా బంతిని స్టాండ్స్‌లోని పంపగలడు అని మరోనెటీజన్‌ కామెంట్ చేశాడు. భజ్జీ నువ్వు అలా చేయగలవా అంటూ నెటీజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్‌.. మార్చి 12 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లోకి అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

Next Story
Share it