అను, అర్జున్.. చెరో సగం
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2020 1:49 PM ISTవయసు ఎంత పెరిగినా తరగని అందం కాజల్ సొంతం. చందమామ కాజల్ అగర్వాల్ నేటితో 35వ వసంతంలోకి అడుగుపెడుతోంది.'లక్మీకళ్యాణం' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 15 సంవత్సరాలుగా కథానాయికగా రాణిస్తోంది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా.. కాజల్ ది ప్రత్యేక స్థానమే. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి.
ప్రస్తుతం కాజల్ నటిస్తున్న చిత్రం 'మోసగాళ్లు'. మంచు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్-ఇండియన్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. హాలీవుడ్ కు చెందిన జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేడు కాజల్ పుట్టిన రోజు సందర్భంగా విష్ణు-కాజల్ ఫస్టు లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సగం మంచు విష్ణు కాగా.. మిగతా సగం కాజల్ ది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో విష్ణు పాత్ర పేరు అర్జున్ కాగా.. కాజల్ పాత్ర పేరు అను. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. లాక్‌డౌన్‌కి ముందే ఈ చిత్రం మేజర్ షూటింగ్ పార్ట్ పూర్తయింది.
మంచు విష్ణ కూడా కాజల్‌కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఎంతో ప్రతిభావంతురాలైన కాజల్ అగర్వాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే కొనసాగించూ పెద్ద కళ్ల అమ్మాయి అనూ అంటూ ట్వీట్ చేశాడు.