కుక్క‌పై కాల్పులు జ‌రిపిన జిమ్ కోచ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 3:38 PM GMT
కుక్క‌పై కాల్పులు జ‌రిపిన జిమ్ కోచ్

హైదరాబాద్‌లో ఓ విచిత్ర‌మైన సంఘటన చోటు చేసుకుంది. మితిమీరిన కోపంతో ఓ జిమ్ కోచ్‌ కుక్కను కాల్చి చంపాడు. నగరంలోని చైత‌న్య‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. చైత‌న్య‌పురిలోని బాపు నగర్‌లో అవినాష్ అనే వ్యక్తి జిమ్ కోచ్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.

అయితే అవినాష్ ఒక్క‌సారిగా తన ఇంటి వద్ద తిరుగుతున్న కుక్క మీద ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో కుక్క అక్క‌డిక్క‌డే చనిపోయింది. ఈ ఘటనపై సదరు కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవినాష్‌ను అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు విచారిస్తున్నారు.

ఈ కుక్క అవినాష్‌కు సంబంధించి ఎవరినైనా కరిచిందా..? లేదంటే అరుస్తుందన్న కారణంతో చంపేశాడా? లేకపోతే ఆ కుక్క యజమానికి, అవినాష్‌కు మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Next Story
Share it