9 నెలల బిడ్డతో సహా ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య
By సుభాష్
అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారితో ఓ తల్లి ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం మారింది. కనీసం ఏడాది కూడా నిండని చిన్నారితో పాటు తల్లి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలచి వేసింది. ఈ ఘటన గంటూరు నగరం లక్ష్మీపురంలోని కమలేశ్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది.
భార్యాభర్తల మధ్య గొడవలో ఏమోగాని.. రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ తల్లి తన 9 నెలల పాపను భవనం నుంచి నెట్టేసింది. దీంతో బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత ఆ మహిళ భవనం నుంచి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.
కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.