గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 16వ నంబర్‌ జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నలుగురు యువకులు గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. యడ్లపాడు మండలం తిమ్మాపూర్‌ వద్దకు రాగానే గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్‌ లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.

దీంతో  కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువులు మృతి చెందారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులురాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామానికి చెందిన అత్తులూరి బలరాం (25), నరసరావుపేటలోని పనసతోటకు చెందిన ఫిరోజ్‌ అహ్మద్‌ (30), శ్రీనివాస్‌నగర్‌కు చెందిన హరికృష్ణ (26), మేడసాని వెంకట శ్రీచంద్‌ (25) గా గుర్తించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.