హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో అక్కా చెల్లెల్ని ఊచకోత కోసిన నిందితుడు ఇస్మాయిల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూన్‌ 29న ఇస్మాయిల్‌ అనే వ్యక్తి తన అక్కా చెల్లెల్ని దారుణంగా హతమార్చి  ,బావపై కూడా దాడికి దిగాడు. అనంతరం బావ ఉస్మాన్‌ ద్విచక్ర వాహనం తీసుకుని పరారయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా, నిందితుడి ఇంటి వెనుక ద్విచక్రవాహనం కనిపించింది.

ఇక స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫలక్‌నుమా ఏసీపీ మహమ్మద్‌ మజీద్‌, చంద్రాయణగుట్ట ఇన్స్‌ పెక్టర్‌ రుద్రభాస్కర్‌ ఇస్మాయిల్ ఇంటికి వెళ్లచూడగా, అతని మృతదేహం కనిపించింది. అతే మృతదేహం కుళ్లిపోయి ఉంది. ఇస్మాయిల్‌ హత్య చేసిన రోజే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, గత సంవత్సరం క్రితం భార్యను నరికి చంపిన కేసులు జైలు శిక్ష అనుభవించి ఇటీవల బయటకు వచ్చాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.