నా ఫ్లెక్సీలు ఎందుకు చింపారు ? : ఎమ్మెల్యే

By రాణి  Published on  2 Jan 2020 9:29 AM GMT
నా ఫ్లెక్సీలు ఎందుకు చింపారు ? : ఎమ్మెల్యే

''ప్రస్తుతం నేను టీడీపీలోనే ఉన్నాను. అయినా నా ఫ్లెక్సీలను ఎందుకు చింపారు ? '' అని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. రెండ్రోజుల క్రితం మద్దాలి గిరిధర్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వైరల్ అవడంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న మద్దాలి ఫ్లెక్సీలను కార్యకర్తలు చించివేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే మద్దాలి ఫ్లెక్సీలను చింపివేయడంపై ఆగ్రహం చెందారు. ఫ్లెక్సీలు చించడమే కాకుండా ఇంటిపై దాడి చేయమని కొందరు ప్రోత్సహిస్తున్నారన్నారు. సీఎం జగన్ ను తన సొంత లాభం కోసం కలవలేదని, ప్రజల సమస్యల పరిష్కార నిమిత్తమే కలిశానని చెప్పుకొచ్చారు. గుంటూరులో జరుగుతున్న యూజీడీ పనులకు నిధులు విడుదల చేయాలని సీఎం ను కోరారన్నారు. సీఎం ను ఎందుకు కలిశానో అడగకుండా..కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా నియోజకవర్గ ఇన్ చార్జ్ ను నియమించడం బాధాకరమన్నారు గిరిధర్.

Next Story