ఖైదీ నంబర్ 6093 : ఏపీ 17వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - చంద్రబాబు

By రాణి  Published on  2 Jan 2020 6:43 AM GMT
ఖైదీ నంబర్ 6093 : ఏపీ 17వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - చంద్రబాబు

గూగుల్ లో ఖైదీ నంబర్ 6093 అని సెర్చ్ చేస్తే..ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరొస్తోందట. అవునండీ..ఇది నిజమే..బుధవారం న్యూ ఇయర్ వేడుకలను బహిష్కరించి సతీ సమేతంగా అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు మద్దతిస్తూ..దీక్షలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు. నారా భువనేశ్వరి రైతులకు విరాళంగా తన చేతి గాజులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు..మన రాష్ర్టానికి 17వ ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లో 6093 అనే నెంబర్ ను సెర్చ్ చేసి చూడండి..ఏమొస్తుందో..మీకే తెలుస్తోంది అని చెప్పుకొచ్చారు. ఆయనలా అన్నారో లేదో..వెంటనే గూగుల్ లో ఈ నెంబర్ గురించి సెర్చ్ చేసిన వారు చాలామందే ఉన్నారు. అలా గూగుల్ లో 6093 అనే నెంబర్ ను సెర్చ్ చేస్తే..చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్ ఖైదీ నంబర్ 6093 అని వస్తోంది. అలాగే ఖైదీ నంబర్ 6093 ఆటో బయోగ్రఫీ, డిస్కర్షన్స్ కూడా వస్తున్నాయి. 2012లో అవినీతి, అక్రమాస్తుల కేసులతో కలిపి మొత్తం 31 కేసుల్లో జగన్ ఏ1 ముద్దాయిగా అరెస్ట్ అయి 16 నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీఐపీ ఖైదీల్లో జగన్ నంబర్ 6093. అప్పుడున్న వీఐపీ ఖైదీల్లోకెల్లా ఈయన బిజీగా ఉండేవారట.Khaidi No 6093 Ap Cm Ys Jagan

ఖైదీ నంబర్ 6093. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట 17వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని గూగుల్ సెర్చ్ రావడం సిగ్గనిపించడం లేదా అని చంద్రబాబు విమర్శించారు. ఇంతలో అక్కడే ఉన్న ఒక అమ్మాయి చంద్రబాబు చెప్పిన నెంబర్ సెర్చ్ చేసింది. నేను చెప్పినట్లే వచ్చిందా లేదా అని చంద్రబాబు అడుగగా..ఆమె వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత ఆ యువతి మైకు తీసుకుని '' 6093 అని సెర్చ్ చేయగానే జగన్ మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది. కావాలంటే చూడండి. ఆయనకు ''గారు'' అని మర్యాద ఇవ్వడం కూడా ఎక్కువే. అందరి నోటిలోని కూడు కొట్టి, రాజధానిని తీసుకెళ్లిపోయాడు. ఇప్పటి వరకూ ఆయన రాష్ర్ట ప్రజలకు చేసిందేమీ లేదు. కనిపిస్తే చెప్పులతో కొట్టేలా ఉన్నారు ప్రజలు. ఇంత జరుగుతున్నా ఆయనకు మాత్రం బుద్ధి రావడం లేదు. ఆనాటి ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ కష్టపడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించి..మీకు అప్పగించారు. మీరు ఇప్పటి వరకూ రాష్ర్టం విడిపోయినా మళ్లీ అభివృద్ధి చేసుకొస్తుంటే..మధ్యలో గద్దెనెక్కి ఏం చేశాడు. ఏం చేయలేకపోతున్నాడు'' అని వాపోయింది ఆ యువతి. ఇప్పుడు ట్విట్టర్ లో కూడా #6093 ట్రెండ్ అవుతోంది.

Next Story