ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ విమర్శలపై ధ్వజమెత్తారు. ”నా కులం ఉందనో, నా కుటుంబం కోసమో హైదరాబాద్ అభివృద్ధి చేయలేదు. సైబరాబాద్ నిర్మించడం, సైబర్ టవర్స్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి ఏ కులం కోసమో కాదు. అలాంటి నాపై కులం ముద్ర వేస్తారా ? అలాగే అమరావతిని ఒక కులం కోసమో, ఒక ప్రాంతం కోసమో నిర్మించాలనుకోలేదు. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన రాజధానిని అందించాలన్న సంకల్పంతో…అన్ని ప్రాంతాలకు చేరువలో నిర్మించాలనుకున్నాం. అమరావతిని ఒక ఆర్ధిక వనరుగా తయారు చేసి, ఆ అభివృద్ధి ఫలాలను రాష్ట్రానికి అందించాలనుకున్నాం. అటువంటి రాజధానికి కులం రంగు పూసి విచ్చిన్నం చేయాలనుకోవడం దుర్మార్గం. అది వైసీపీ నేతలు బుద్దిహీనత. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. అలాంటి అమరావతిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలుగా మనందరి బాధ్యత. రాజధాని రైతులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధమవుదాం.” అని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.