ఆడైనా..మగ అయినా సరే..తాము ప్రేమించేవాళ్లు తమతోనే మాట్లాడాలని అనుకుంటుంటారు. అందులో తప్పు లేదు. ఇది కూడా ఒకరకమైన ప్రేమే అని అవతలి అర్థం చేసుకుంటే సరే. అర్థం చేసుకోకపోతే మరోలా ఉంటుంది. తనతోనే మాట్లాడాలి, తనతోనే ఉండాలి..ఇంకెవరితోనూ మాట్లాడకూడదు అనుకుంటే ఎలా ? అన్న భావన ఉన్నవారు కూడా ఉంటారు. దీనిని కొంతమంది అతిప్రేమ అంటే..మరికొందరు స్వార్థం, సైకో మెంటాలిటీ, అనుమానం లాంటి పేర్లు పెడుతుంటారు. ఏ పేరైతేనేం చివరికి అదే గొడవలకు దారితీస్తోంది.

Also Read : ప్రియుడితో రాసలీలలు .. బంధువు చూశాడని..

కానీ ఇప్పుడు మనం చదివే దానిలో..ఆ అమ్మాయి తప్పు ఉందా ? లేదా ? తెలుసుకోకుండానే కొడవలితో నరికేశాడు ఆమె ప్రియుడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన ఓ సంఘటన అక్కడున్న వారందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దాచేపల్లికి చెందిన 35 ఏళ్ల షేక్ కాసింబీకి.. గురజాలకు చెందిన బండి శ్రీనివాసరావుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శ్రీను కాసింబీ తన మనిషి అని..కేవలం తనతో తప్ప మరెవరితోనూ మాట్లాడకూడదని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు. ఇటీవల ఆమె ఒక వ్యక్తితో మాట్లాడుతుండటం చూసిన శ్రీను..ఏం ఆలోచించకుండా తన వద్ద ఉన్న కొడవలితో నరికేశాడు. ఆమె కింద పడి గిలగిల కొట్టుకుంటుంటే..ఆ చుట్టుపక్కల వారితో పాటు ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తి కూడా అయ్యో అయ్యో అంటూ పెద్దగా కేకలేశారు. కాసేపటికి తేరుకున్న శ్రీను..కాసింబీ అతనితో ఎందుకు మాట్లాడుతుందో..ఆమెకి, అతనికి మధ్య రిలేషన్ ఏంటో కూడా అడగకుండా ఇలా చేశానేంటా అనుకుంటూ..అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా..వైద్యులు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Also Read :ప్రియుడి ఎదుటే.. ప్రియురాలిపై పోలీసుల అత్యాచారం

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.