ప్రియుడితో రాసలీలలు .. బంధువు చూశాడని..

అక్రమ సంబంధం ఆమె జీవితాన్ని జైలుపాలు చేసింది. భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని ఇంట్లో నే రాసలీలలు సాగిస్తూ వచ్చింది. ఒకరోజు ఆమె తన ప్రియుడితో రాసలీలు సాగిస్తున్న సమయంలో తన బంధువు చూశాడని గమనించి ప్రియుడితో కలిసి హతమార్చింది. ఇరువురు కలిసి పారిపోతున్న క్రమంలో పోలీసులకు చిక్కడంతో వీరి బండారం బయటపడింది. ఈ ఘటన తమిళనాడు జిల్లాలో చోటు చేసుకుంది. తమిళనాడులోని మదురై తిరుమాల్‌  తాలూకా చైన్నైమెట్టుకు చెందిన సుబ్బయ్యకు లక్ష్మీ తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది.

ఇటీవల ఆమె శివగంగై జిల్లా ఇడమ మేలూరుకు చెందిన పాండితో అక్రమ సంబంధం పెట్టుంది. అప్పటి నుండి భర్త ఇంట్లోలేని సమయంలో వీలు చిక్కినప్పుడల్లా తన ప్రియుడిని పిలిపించుకొని రాసలీలు సాగించేది. ఇలా కొద్దిరోజుల జరిగిన తరువాత ఒక రోజు ఇంట్లో బెడ్‌రూంలో తన ప్రియుడితో రాసలీలు సాగిస్తున్న లక్ష్మీని ఆమె బంధువు పేతురాజ్‌ చూశాడు. దీంతో ఆమెను నిలదీయడంతో విషయం భర్తకు తెలుస్తుందనే భయంతో లక్ష్మీ తన ప్రియుడితో కలిసి పేతురాజ్‌పై దాడి చేసింది. ఈ దాడిలో అతడు తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందాడు. దీంతో లక్ష్మీ తన ప్రియుడితో పరారైంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న శివగంగై పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. అన్ని రైల్వే స్టేషన్‌లకు వీరి ఫొటోలను పంపించారు. చివరకు జోలార్‌పేట రైల్వే స్టేషన్‌లో చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే రైలును నిలిపివేసి వారికోసం గాలించగా ఓ బోంగీలో ఇరువురిని గుర్తించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *