తుపాకీతో కాల్చుకుని బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య..!

By సుభాష్  Published on  1 Nov 2020 12:19 PM IST
తుపాకీతో కాల్చుకుని బ్యాంకు సెక్యూరిటీ గార్డ్‌ ఆత్మహత్య..!

హైదరాబాద్‌ మహంకాళి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర జరిగిపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కార్యాలయం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న మధు అనే వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధుల్లో ఉండగా, ఎస్‌ ఎల్‌ ఆర్‌ తూపాకీతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. మధు స్వగ్రామం నల్గొండ జిల్లా బత్తులపాలెం నేరేడు చలర్లకు చెందిన వ్యక్తి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే గన్‌ మిస్‌ ఫైర్‌ కారణంగా ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఉదయం మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తున్న సమయంలో గన్‌ మిస్‌ఫైర్‌ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Next Story