గన్‌ మిస్‌ ఫైర్‌.. కానిస్టేబుల్‌ తలోకి దూసుకెళ్లిన..

By అంజి  Published on  22 Feb 2020 4:10 PM GMT
గన్‌ మిస్‌ ఫైర్‌.. కానిస్టేబుల్‌ తలోకి దూసుకెళ్లిన..

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. గన్‌ను శుభ్రం చేస్తుండగా.. అది మిస్‌ ఫైర్‌ కావడంతో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన తిర్యాణి పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. కానిస్టేబుల్‌ కిరణకుమార్‌ తలలోకి బుల్లెట్‌ దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. ఆయన గన్‌ను క్లీన్‌ చేస్తోన్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గాయాలపాలై, రక్తపు మడుగులో పడి ఉన్న కిరణ్‌కుమార్‌ను పోలీసులు 108 వాహనంలో బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం కిరణ్‌ కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కిరణ్‌కుమార్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్‌ కిరణ్‌ స్వస్థలం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం. 132వ బెటాలియన్‌ బి-కంపెనీ కానిస్టేబుల్‌గా కిరణ్‌కుమార్‌ విధులు నిర్వహిస్తుండగా.. ఈ ఘటన జరిగింది.

Next Story
Share it