ప్రధాని మోడీనే మురిపించిన చిన్నారి !!

By సత్య ప్రియ  Published on  17 Oct 2019 4:56 PM IST
ప్రధాని మోడీనే మురిపించిన చిన్నారి !!

ఒక చిన్నారి మాటలు ప్రధాని మోడీనే మురిపించాయి. చిన్నారి వీడీయో ని ఆయన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా పొస్ట్ చేసారు. బాలీవుడ్ నటి గుల్ పనాగ్, తన కుమారుడు నిహాల్ వీడియో ను ట్విట్టర్ లో ఉంచింది. అంతే కాక, ప్రధాని మోడి ని ట్యాగ్ చేసింది.

అందులో, ఒక మ్యాగజీన్ చూపిస్తూ పుస్తకంపై ఉన్నది ఎవరు అని తల్లి చిన్నారి ని అడగుతుంటే 'మోడి ‘ అంటూ గుర్తించాడు నిహాల్. అప్పుడు తల్లి మోడీజీ అంటూ సవరించగానే 'మోడీజీ.. మోడీజీ' అంటూ సమాధానమిచ్చాడు.



గుల్ ట్వీట్ తో ఎంతో సంతోషించిన ప్రధాని "చాలా ముద్దుగా ఉంది. నిహాల్కు నా ఆశీర్వాదాలు తెలపండి. తాను అనుకున్న దానిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. మీలో అతడికి ఓ గొప్ప గురువు, మార్గనిర్దేశకురాలు కనపడతారని నేను విశ్వసిస్తున్నా." -- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి అంటూ రీట్వీట్ చేసారు.



అటు గుల్ పనాగ్ ట్వీట్ నీ, ప్రధాని ట్వీట్ ని చూసి నెటిజన్లు కూడా మురిసిపోతున్నారు. మీరు ఆ వీడియోని చూసేయండి.

[video width="480" height="480" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/10/Kx9d2NVjCG3GeT-n.mp4"][/video]

Next Story