గుజ‌రాత్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 8 మృతిచెందారు. మ‌రో 22 మంది తీవ్ర‌గాయాల పాల‌య్యారు. వివ‌రాల్లోకెళితే.. రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ఉకాయ్ కు వెళుతున్న ట్యాంకర్- బస్సు- జీపు పరస్పరం ఢీకొన్నాయి. తపి జిల్లా కేంద్రంలో జిగిన ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 22 మంది గాయపడ్డారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. సోన్‌గంద్‌ తాలూకా పరిధిలోని గుజరాత్‌ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు.. ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్‌ ఢీకొన్నాయి. బ‌స్సు వెన‌క‌నే వ‌స్తున్న‌ జీపు.. బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే.. ట్యాంకర్‌ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు. ట్యాంకర్‌ డ్రైవర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.