చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నారు-గుడివాడ అమర్ నాథ్
By న్యూస్‌మీటర్ తెలుగు
విశాఖపట్నం: మాజీ సీఎం, టీడీపీ అధినేతపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని అమర్‌నాథ్ అన్నారు. సీఎం జగన్‌పై చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు మతిపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ పాలన గురించి పిచ్చోడి చేతిలో రాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
లోకేష్ భవిష్యత్తు ఎంటో అర్థం కాని పరిస్థితిలో చంద్రబాబు అలా మాట్లాడతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు. మరో ఆరు నెలల్లో వైఎస్ జగన్ దేశంలోనే నెంబర్ వన్ సీఎం అవుతారని అమర్‌నాథ్ అన్నారు. కాగా గత ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రజలు నవ్వుకునేలా మాట్లాడవద్దంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే అమర్‌నాథ్ సూచించారు.