అమ్మాయిల్లో ఎక్కువైన శృంగారపు ఆలోచనలు..!

By అంజి  Published on  28 March 2020 5:26 AM GMT
అమ్మాయిల్లో ఎక్కువైన శృంగారపు ఆలోచనలు..!

హైదరాబాద్‌: పాత తరం.. కొత్త తరం మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. కాలంతో పాటు మనిషి ఆలోచనలు కూడా మారిపోయాయి. మానవుడు తన మెదడుకు పని పెట్టి.. ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశాడు. ఒకప్పటి వారి ఆలోచనలు.. ఇప్పటివారి ఆలోచనల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. అలానే అమ్మాయిల్లో సైతం ఆలోచనలు అంతే వేగంగా మారిపోయాయి.

అమ్మాయిల శృంగారపు ఆలోచనల్లో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిసింది. 50 ఏళ్ల కిందటి మహిళా ఆలోచన విధానాలతో పోలిస్తే.. ఇప్పటి తరం అమ్మాయిల్లో శృంగారాపు ఆలోచనలు చాలా పెరిగాయని ఓ అధ్యయనం వెలువరించింది. ఖాళీ సమయంలో కూడా చాలా మంది అమ్మాయిలు శృంగారం గురించే ఆలోచిస్తారని తెలిసింది. ఇటీవల జర్మనీలోని ఫ్రీయిబర్గ్‌ ఆప్‌ యూనివర్సిటీకి చెందిన కొంత మంది పరిశోధక విద్యార్థులు అమ్మాయిల శృంగారాపు ఆలోచనలపై సర్వే చేశారు. టీనేజీ వయస్సు నుంచి 92 ఏళ్ల వయస్సు ఉన్న 2,90,716 మంది మహిళలను శృంగారంపై ఆలోచన విధానాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read: లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్‌.. కండోమ్‌లకు యమ గిరాకీ!

30 ఏళ్ల వయస్సున్న మహిళల్లో నిద్ర సమయంలో ఐదోవంతు శృంగారపు కలలు వస్తున్నాయంట. ఇక అదే వయస్సులో మగవారిలో మూడో వంతు మాత్రమే శృంగారపు కలలుకంటున్నారని పరిశోధకులు తమ అధ్యయనంలో తెలిపారు. ఇలాంటి సర్వేనే గతంలో 50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలపై నిర్వహించారు. అయితే వారికి నిద్రించే సమయంలో మూడో వంతు శృంగారపు ఆలోచనలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. గత దశాబ్దకాలంలో లింగపరమైన అంతరాలు కూడా సమసిపోయాయి. దీంతో మహిళల్లో ఫెమినిజం పెరిగిందని సైకాలజీ అండ్‌ సెక్సువాలిటీ అనే జనరల్‌ ఓ కథనం రాసింది. పాతతరం మహిళలతో పోలిస్తే.. ఈ తరం యువతులు శృంగారంపై బహిరంగంగానే చర్చిస్తున్నారు. అయితే అమ్మాయిల్లో శృంగారపు ఆలోచనలు చాలా వరకు మంచివనే పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి రాత్రిని వసంత రాత్రి జరుపుకోవాలని ఏ అమ్మాయికి ఉండది చెప్పండి.

Also Read: భయం గుప్పిట్లో ‘అగ్రరాజ్యం’

Next Story