భయం గుప్పిట్లో 'అగ్రరాజ్యం'

By సుభాష్  Published on  28 March 2020 4:50 AM GMT
భయం గుప్పిట్లో అగ్రరాజ్యం

ముఖ్యాంశాలు

  • అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్న కరోనా

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. వైరస్‌ వల్ల మృత్యుఘోర వినిపిస్తోంది. ఎక్కడ చూసినా కరోనాతో గజగజవణికిపోతున్నాయి ప్రపంచ దేశాలు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలకు చాపకింద నీరులా వ్యాపించింది. దాదాపు 200 దేశాలను ఈ వైరస్‌ వెంటాడుతోంది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో, మరణాల్లో ముందుగా చైనా దేశం ఉండగా, తర్వాత స్థానం ఇటలీ ఆక్రమించింది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా సైతం చైనాను దాటేసింది. ఇప్పటి వరకు అమెరికాలో లక్షలకుపైగా పాజిటివ్‌ల సంఖ్య నమోదైంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వణికిపోతున్నారు.

అగ్రరాజ్యం పెద్దన్న కరోనా మహమ్మారిని ఏం చేయలేకపోతున్నారు. ఎంతో టెక్నాలజీ ఉన్న ఈ దేశంలో కరోనాతో తలకిందులవుతోంది. ట్రంప్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇక త్వరలో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశం కరోనా వైరస్‌ బారిన పడటంతో ట్రంప్‌కు మరింత భయం పట్టుకుంది. తన ఓటమికి ఈ మహమ్మారి కారణం అవుతుందేమోనన్న భయం ట్రంప్‌కు పట్టుకుందంటే .. పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కరోనా కారణంతో ఆర్థికంగా కుదేలైపోయింది. వ్యాపారాలన్నీ షట్‌డౌన్‌ అయ్యాయి. ఈ మహమ్మారి అగ్రరాజ్యంలోని అన్ని రాష్ట్రాలకు పాకింది. రోజురోజుకు పాజిటివ్‌ల సంఖ్య పెరగడం, మరో వైపు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ట్రంప్‌కు కంటిమీద కనుకు లేకుండా మారింది. ముఖ్యంగా చెప్పాలంటే చైనాలోని వూహాన్‌ నగరం నుంచి అధిక మంది డిసెంబర్‌లోనే అమెరికాకు వచ్చారు. ఈ దేశం నుంచి వీకెండ్‌లో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. కరోనా ఏం చేయలేదన్న ధీమాలో ఉన్న ట్రంప్‌ ధీమాపై కరోనా కాటు వేసింది.

ప్రస్తుతం అమెరికాలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, లోవా, లూసినాయానా, ప్లోరిడా, ఉత్తర కరోలినా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ మహమ్మారి వెంటాడుతోంది. అక్కడ ప్రజలు ఎటు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ ఎటువైపు నుంచి మృత్యు ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి తయారైంది అమెరికా పరిస్థితి. ఈ వైరస్‌ కారణంగా దేశంలో మరో మూడు నెలలు కఠిన సమయం అనుభవించాల్సిందేని ట్రంప్‌ చెబుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Next Story