సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసరాలు
By రాణి Published on 9 April 2020 8:06 PM IST![సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసరాలు సినీ కార్మికుల ఇళ్లకే నిత్యావసరాలు](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/Groceries-Ready-for-Cine-Workers-Families.jpg)
లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీసీసీ (సినీ క్రైసిస్ ఛారిటీ) ని ప్రారంభించిన సంగతి విధితమే. 10 రోజులుగా సీసీసీకి వచ్చిన విరాళాలతో సినీ కార్మికుల కుటుంబాలకు కావాల్సిన నిత్యావసరాలను కొనుగోలు చేశారు. గురువారం ఈ నిత్యావసరాలను నేరుగా కార్మికుల ఇళ్లకే పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. అలా నిత్యావసరాలను ప్యాక్ చేస్తోన్న వీడియోను చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Also Read : హైదరాబాద్ లో 15 హాట్ స్పాట్లు..నిత్యావసరాలు ఇంటికే..
'' రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావసరాలను అందించేందుకు చాలా జాగ్రత్తగా వస్తువులను ప్యాక్ చేస్తున్నారు. అంతా సిద్ధమయ్యాక ప్రతి ఇంటికీ నేరుగా వస్తువులను పంపిస్తాం. ఈ కార్యక్రమంలో మానవత్వంతో భాగస్వాములైన వారందరికీ నా కృతజ్ఞతలు '' అని చిరు ట్వీట్ చేశారు. కాగా..సీసీసీ కోసం టాలీవుడ్ అగ్రనాయకులతో పాటు దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు తమ వంతు చేయూతనందించారు.