రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం గ్రే హౌండ్స్ క్యాంపస్‌లో చాంద్ పాషా సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా.. చాంద్ పాషా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.