బామ్మ గారి సాహసం -పారాగ్లైడింగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 7:51 AM GMT
బామ్మ గారి సాహసం -పారాగ్లైడింగ్

చాలామందికి బిల్డింగ్ పైకెక్కి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఇక వయసు మళ్ళిన వాళ్ళు అయితే బాబోయ్ నా వల్ల కాదంటూ ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లడమే మానేస్తారు. కానీ ఈ బామ్మ అందరిలా కాదు. కుమారుడి పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి కులు వెళ్లారు బిలాస్పూర్‌కు చెందిన 71 ఏళ్ల సంతోష్ మిశ్రా. యువతీ యువకులందరూ పారాగ్లైడింగ్ చేస్తుంటే చూసి ముచ్చటపడ్డారు. అంతే కాదు కుటుంబ సభ్యులు ఎంత వారిస్తున్నా వినకుండా తాను కూడా పారాగ్లైడింగ్ చేస్తానని పట్టుబట్టారు. ఇక చేసేదేమి లేక కుటుంబ సభ్యులు అంగీకరించారు.

దీంతో అక్కడి గ్లైడర్ సహాయంతో వంద అడుగుల ఎత్తులో చక్కర్లు కొట్టారు సంతోష్ మిశ్రా. ఇది తనకు మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది అంటున్నారు ఆమె. అక్టోబర్ 12న బామ్మ పారాగ్లైడింగ్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంట్లో కూర్చొని మనవళ్ళతో ఆడుకొని, రామా, కృష్ణ అనుకునే వయసులో ఈ భామ చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Next Story