ప్రభుత్వ అలసత్వమే.. కరోనా మహమ్మారి తీవ్రంగా పెరగడానికి కారణమయ్యిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 May 2020 8:37 AM IST
ప్రభుత్వ అలసత్వమే.. కరోనా మహమ్మారి తీవ్రంగా పెరగడానికి కారణమయ్యిందా..?

కరోనా వైరస్ కేసులు పెరిగాయి.. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేతపై శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలను పట్టించుకోలేదు.

2020 ఏప్రిల్ మొదటి వారంలో ప్రభుత్వానికి చెందిన శాస్త్రవేత్తలు కోవిద్-19 లాక్ డౌన్ ఎత్తివేయడంలో కొన్ని సూచనలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం వారు ఇచ్చిన సూచనలను పట్టించుకోలేదు. దీంతో కేసులు 10,841 శాతం పెరిగాయి.

ముంబై: ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించాలి. ఎవరికైతే కోవిద్-19 లక్షణాలు ఉంటాయో వారిని గుర్తించి వెంటనే హోమ్ క్వారెంటైన్ లో ఉంచాలి. 14 రోజుల పాటూ వారిని వాళ్ళ ఇంట్లోనే ఉంచి చికిత్స అందించడం ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రతి జిల్లాలోనూ ఇదే విధంగా కొన్ని సూచనలను పాటించడం ద్వారా 40శాతం వరకూ కేసులను తగ్గించవచ్చు. వైద్యానికి సంబంధించిన మౌళిక సదుపాయాలను పెంపొందించవచ్చు. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ ను రిలాక్స్ చేయించాలని శాస్త్రవేత్తలు సూచించారు.

వారు చెప్పిన నిబంధనలన్నీ పాటించి.. ఎప్పుడైతే ప్రతి ఒక్క జిల్లా లోనూ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అప్పుడు మాత్రమే లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్(ఐ.సి.ఎం.ఆర్.) ప్రభుత్వానికి సూచించింది. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే 'ఆర్టికల్ 14' ఓ ప్రెజెంటేషన్ ను రివ్యూ చేసింది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేయాలని సూచించారు.

శాస్త్రవేత్తలు దీనిపై ప్రభుత్వానికి ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. సరైన ప్లానింగ్ లేకుండా లాక్ డౌన్ ను ఎత్తివేయడం ద్వారా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. లోకల్ గా ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టకుండా లాక్ డౌన్ ను ఎత్తివేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.

Icmr Lockdown Tree

దాదాపు ఆరు వారాలకు పైగా లాక్ డౌన్ ను అమలు చేసినప్పటికీ.. ఆ తరువాత రెండు, మూడు సార్లు లాక్ డౌన్ ను పొడిగించినప్పటికీ ఇప్పటికీ ప్రతి ఇంటికీ సర్వే అన్నది చేయలేకపోయింది భారత ప్రభుత్వం. లాక్ డౌన్ కు సంబంధించిన డెసిషన్ మేకింగ్ ట్రీ ను ఐ.సి.ఎం.ఆర్. బయటపెట్టింది. సరైన చర్యలు తీసుకున్న తర్వాత.. ఏదైతే వైరస్ కట్టడికి ఉపయోగపడుతుందో అదే తరహాలో లాక్ డౌన్ ను 700పైగా జిల్లాల్లో ఎత్తివేయాలని సూచించారు.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో..!

నిపుణులు చెప్పిన సూచనలను పట్టించుకోకుండా లాక్ డౌన్ ను ఎత్తివేస్తే కోవిద్-19 పాజిటివ్ రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

మార్చి 24 న భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసినప్పుడు దేశంలో ఉన్న పాజిటివ్ రోగుల సంఖ్య 618. మే 11 నాటికి 67000 కేసులు.. అంటే 10741శాతం పెరిగింది. మే 7 నాటికి 15 పెద్ద నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్.. మొదలైన నగరాలలోనే 60శాతం కేసులు నమోదయ్యాయి. ఈ నగరాలు లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరిగింది. ముంబై లో 67 కేసులు ఉన్న సమయంలో లాక్ డౌన్ మొదలైంది. మే 11 నాటికి 13000 కోవిద్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే 19303 శాతం పెరుగుదల ఉంది. ఢిల్లీలో లాక్ డౌన్ మొదలైన నాటికి 35 కేసులు ఉండగా.. మే 11 నాటికి 7233 కేసులు నమోదయ్యాయి.. ఇది 20565 శాతం పెరుగుదల. అహ్మదాబాద్ లో 25 మార్చి నాడు 14కేసులు నమోదవ్వగా.. మార్చి 31 నాటికి 5818 కేసులు నమోదయ్యాయి.. దాదాపు 41457 శాతం కేసులు పెరిగాయి.

ఇలాంటి తరుణంలో మహారాష్ట్రకు చెందిన అధికారులు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అన్నది జరిగుతోందని ఒప్పుకున్నారు. ఒడిశాలో కూడా ఒక్క వారంలోనే కేసులు రెట్టింపు అయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగం ఏప్రిల్ 24న మాట్లాడుతూ మే 16 తర్వాత దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం లేదని చెప్పింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే.. వారు అనుకున్నట్లు జరిగేలా కనిపించడం లేదు.

ఏప్రిల్ 30న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక ఆర్డర్ ను బయట పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ప్రాంతాన్ని రెడ్, ఆరెంజ్ గ్రీన్ అంటూ కోవిద్ కేసులను బట్టి విభజించాలని.. వీలైన చోట్ల నిబంధనలను సడలించేలా చర్యలను తీసుకోవాలని సూచించారు.

భారత హెల్త్ మినిస్టర్ హర్ష వర్ధన్, హెల్త్ సెక్రెటరీ ప్రీతీ సుదాన్, ఐసిఎంఆర్ డైరెక్టర్ జెనరల్ బలరాం భార్గవ, ఐసిఎంఆర్ చీఫ్ ఆఫ్ ఎపిడెమోలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్ రామన్ గంగఖేడ్కర్ లను జోనింగ్ అన్నది ఎలా విధిస్తున్నారు, ఐసిఎంఆర్ ఇచ్చిన సూచనలను ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది ఆర్టికల్ 14 అడిగింది. కానీ ఇప్పటి వరకూ వారు స్పందించలేదట.

ఏప్రిల్ 30న ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆర్డర్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని నిబంధనలను సడలించాలి అన్నది తెలపలేదు. హెల్త్ మినిస్ట్రీ ఆర్డర్ లో 'ఫీల్డ్ ఫీడ్ బ్యాక్.. ప్రత్యేకంగా రాష్ట్రప్రభుత్వాల దగ్గర ఉన్న డేటా ప్రకారం జోన్ లను విభజించవచ్చు. మినిస్ట్రీ ల అనుమతి తీసుకున్న తర్వాతనే రెడ్/ఆరెంజ్ జోన్ లలో నిబంధనలను సడలించాలి' అని ఉంది.

ఒక రోజు తర్వాత మే 1వ తేదీన, హోమ్ మినిస్ట్రీ లాక్ డౌన్ అన్నది పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెడ్ జోన్ లాంటి విషయాలలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాము చెప్పిన జోన్ లలో నిబంధనలను సడలించకూడదని అన్నారు. నిర్ణయాలు అన్నవి ఎలా తీసుకోవాలి, తీసుకోకూడదు అన్నది మాత్రం వివరించలేదు.

అవకాశాలను చేజార్చుకోవడమే:

ఆర్టికల్ 14 చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం.. పెద్ద ఎత్తున వైరస్ బాధితులు పెరిగే అవకాశం ఉందంటూ ఏప్రిల్ మొదటి వారంలోనే ఐసిఎంఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లాక్ డౌన్ ను ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే కాకుండా.. వైద్య పరికరాలు కొనుగోలు చేయడానికి.. ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలను ఏర్పాటు చేయడానికి సరైన సమయం లభించినట్లేనని.. దాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.

గడప గడపకూ వెళ్లి సర్వే చేయడమే కాకుండా.. నిఘాను కూడా పెంచాలని కోరింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని. ఇవన్నీ పట్టించుకోకుండా ఏ నిర్ణయం తీసుకున్నా వచ్చే ఫలితాలు తాత్కాలికమేనని ఐసిఎంఆర్ స్పష్టం చేసింది.

ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలను పట్టించుకోకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి ఐసిఎంఆర్ మరోసారి హెచ్చరికలను ప్రభుత్వానికి పంపింది. ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు ఫిబ్రవరి నెలలోనే చైనాలో అమలుచేసిన తరహాలో లాక్ డౌన్ అమలుచేయాలని ప్రభుత్వానికి సూచించింది. అయినా కేంద్ర ప్రభుత్వం దానిని చెవులలో వేసుకోలేదు. లాక్ డౌన్ ను అమలు చేసి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది.

ఈ సలహాలను, సూచనలను పట్టించుకోని ప్రభుత్వం.. మార్చి 24న కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే లాక్ డౌన్ ను అమలు చేసింది. ఎంతో మంది పేద ప్రజలకు, వలస కార్మికులకు ఇది తేరుకోలేని దెబ్బ.

లాక్ డౌన్ ను అమలు చేస్తున్న సమయంలోనే ఐసిఎంఆర్ శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి సైంటిఫిక్ గా కొన్ని చర్యలను తీసుకోవాలని సూచిస్తూ వచ్చింది. కానీ వీటిని కేంద్రం పట్టించుకోలేదు. లాక్ డౌన్ ముగిశాక పెద్ద ఎత్తున వైరస్ సోకినా కూడా ప్రభుత్వం తప్పకుండా అన్నిటికీ సిద్ధపడాలని వారు సూచించారు. క్వారెంటైన్ సెంటర్ల దగ్గర నుండి ఆసుపత్రి బెడ్ ల వరకూ అన్నిటినీ పెంచుకోవాలని వారు సూచించారు. కానీ వాటిపై కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపలేదు.

ఐసిఎంఆర్ శాస్త్రవేత్తల సూచనలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రియాక్టివ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. 'కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇంకా ఎటువంటి వ్యాక్సిన్ లేదు.. ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా లేదు.. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళను గుర్తించడం, వారికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారానే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని' పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, నేషనల్ టాస్క్ ఫోర్స్ మెంబర్ ఆఫ్ కోవిద్19 అయిన కె.శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మొత్తం జోన్ మీద నిఘా పెట్టడం కంటే ఇదే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

శాస్త్రవేత్తల సూచనలను పక్కదారి పట్టించడం:

ఐసిఎంఆర్ ఇచ్చిన డెసిషన్ మేకింగ్ ట్రీను చూశారు అధికారులు. ఏప్రిల్ మొదటి వారంలో నీతి ఆయోగ్ మెంబర్ వినోద్ కె పాల్ మాట్లాడుతూ ఐసిఎంఆర్ ఇచ్చిన సూచనలకు తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడానికి కేవలం ఒక్క వారం మాత్రమే ప్రభుత్వానికి పడుతుంది అని అన్నారు. బయటకు మాత్రం ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులోనే ఉందంటూ ప్రభుత్వం చెప్పుకొంటూ వస్తోంది. లోపల మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

ఏప్రిల్ 14, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ స్టేట్ గవర్నమెంట్స్ తో మాట్లాడుతూ భారతదేశంలో కరోనా వైరస్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Exponential Image

అదే రోజున కేంద్ర ప్రభుత్వం జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా విభజిస్తూ ప్రకటన జారీ చేసింది.

First Red Classification

గత 28 రోజుల కాలంలో ఎటువంటి కేసులు కూడా రాని ప్రాంతాలలో గ్రీన్ జోన్ గా విభజించారు. మిగిలిన వాటిని ఆరెంజ్ జోన్ కిందకు తీసుకుని వచ్చారు.

రెడ్ జోన్ లో 14 రోజుల్లో ఒక్క కేసు కూడా రాకుండా ఉంటే వాటిని తిరిగి ఆరెంజ్ జోన్ లోకి తీసుకుని వస్తారు. మరో 14 రోజుల్లో ఆరెంజ్ జోన్ లో ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాకపోతే గ్రీన్ జోన్ గా మారుస్తారు.

ఇలాంటి సమయంలో చాలా జిల్లాల్లో కేసులు లేవని చెబుతున్నాయి. కానీ ఆయా జిల్లాల్లో టెస్టింగ్ లు ఎంత వరకూ చేస్తున్నారు, లక్షణాలు ఉన్న వారిపై నిఘా ఉంచారా లేదా అన్నది కూడా తెలుసుకోవాలని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ టీమ్ మెంబర్ ఒకరు తెలిపారు.

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ ఏప్రిల్ 23న తమ రాష్ట్రంలో కరోనా కేసులే లేవని ప్రకటించారు. ఇద్దరు కోవిద్-19 రోగులకు నెగటివ్ రాగానే ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. కానీ రెండు వారాల తర్వాత అక్కడ కేసులు ఏకంగా 62కు పెరిగింది. బిఎస్ఎఫ్ జవాన్ లను పరీక్షలు చేయగా మే 10 నాటికి 100కు పైగా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. టెస్టులు సరిగా చేయకపోవడం వలన కూడా కరోనా వ్యాప్తి పై తక్కువ అంచనా వేసినట్లే..!

ఏప్రిల్ 15 నుండి మే 1వ తేదీ వరకూ మొదటి సారి లాక్ డౌన్ ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటికి కూడా దేశవ్యాప్తంగా గడప గడపకూ నిఘా అన్నది ఏర్పాటు చేయలేదు. ఐసిఎంఆర్ ఫిబ్రవరి నెలలోనూ, ఏప్రిల్ మొదటి వారంలోనూ సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోలేదు.

ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో వార్డుల్లోనూ, పల్లెల్లోనూ వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళుతూ ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా ఏ ఇంట్లో కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు వచ్చినా వెంటనే వారిని గుర్తిస్తున్నారని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోడానికి డాక్టర్లే రావాల్సిన అవసరం లేదని.. వాలంటీర్లు, ఆశా వర్కర్లే గుర్తిస్తున్నారని ఆయన అన్నారు.

దేశ వ్యాప్తంగా టెస్టింగ్ ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం అనుకున్న స్థాయిలో చేయలేకపోతోంది. రాబోయే 15 రోజుల్లో లాక్ డౌన్ ను ముగించే అవకాశం ఉంది. కాబట్టి కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. రాబోయే 15 రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 14 నాటికి భారత్ లో 12000 కేసులు ఉండగా, ఏప్రిల్ 30 నాటికి 33000 కేసులు చేరుకున్నాయి. మే 9 నాటికి 60000 చేరుకున్నాయి. లాక్ డౌన్ ను ఎత్తివేస్తే సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

సరికొత్త కార్యాచరణ:

మే 1 నాడు యూనియన్ మోనిస్ట్రీ 12 పేజీల ఆర్డరును జోన్ ల విభజించడానికి జారీ చేసింది. రెడ్ జోన్స్ లేదా హాట్ స్పాట్ గా గుర్తించబడిన జిల్లాల్లో టెస్టింగ్ ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నారు. ఎప్పటికప్పుడు నిఘాను పటిష్టం చేయాలని సూచించారు. ముఖ్యంగా కేసులు రెట్టింపు అవుతున్నాయా లేదా అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలని అందులో కోరారు.

ప్రభుత్వం కానీ, ప్రభుత్వానికి చెందిన ఆర్డర్ కానీ జోన్ ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సరైన క్లారిటీ ఇవ్వడంలో కూడా విఫలమయ్యాయి. లాక్ డౌన్ ను ఎప్పుడు ముగించాలి.. అంతకుముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపై ఇంకాస్త మెరుగైన సమాచారం ఇవ్వాలి.

లాక్ డౌన్ సమయమన్నది క్వారెంటైన్ సదుపాయాలను పెంచుకోడానికి, ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలను ఏర్పాటు చేసుకోడానికి.. మహమ్మారి పెద్ద ఎత్తున ప్రబలిన సమయంలో తట్టుకుని నిలబడడానికి సమాయత్తమవ్వడానికి మాత్రమే, కానీ ఈ జోన్ ల వ్యవహారం ఏమిటో మాత్రం అంతుబట్టడం లేదు.

నిర్ధేశిత సమయంలో ఓ జిల్లాలో 500 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ సమయంలో కేవలం 50 బెడ్స్ మాత్రమే ఉన్నాయంటే ఇబ్బందులు తలెత్తడం పక్కా అని చెబుతున్నారు. అదే 1000 బెడ్లను జిల్లాలో ఏర్పాటు చేసుకుని ఉంటే మాత్రం ఎప్పుడు ఎలా కేసులు పెరుగుతాయో అన్న దాన్ని బట్టి ఎదుర్కొనే వెసులుబాటు ఉంటుంది.

నిఘా వ్యవస్థనే పరమావధిగా:

ఏప్రిల్ 30న ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డర్ కారణంగా చాలా పొరబడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. 'సర్వేలైన్స్ ఫీడ్ బ్యాక్' అన్నది ప్రభుత్వం చెబుతోంది. కానీ ఐసిఎంఆర్ మాత్రం గడప గడపకూ సర్వే చేయాలని కోరుతోంది. ప్రభుత్వ ఆర్డర్ లో సర్వేలైన్స్ ఫీడ్ బ్యాక్ అన్నది ఉంటె ఐసిఎంఆర్ సూచనలను కనీసం పాటిస్తూ ఉన్నట్లే.. కానీ అవేవీ పాటించడం లేదని నిపుణులు ఆర్టికల్ 14తో చెప్పారు.

ఐసిఎంఆర్ వారం వరం గడప గడపకూ వెళ్లి సర్వే చేయాలని సూచించింది. దేశంలోని 700 జిల్లాల్లో ఈ పని చేయమని కోరింది. అంతేకాకుండా 'సెంటినెల్ సర్వేలయిన్స్' ను కూడా అమలు చేయమని కోరింది. కోవిద్-19 అనుమానితుల శాంపుల్స్ ను పరీక్షించడమే కాకుండా.. ఎక్కడైతే కరోనా వైరస్ వ్యాప్తి ఉండదో వారికి సంబంధించిన శాంపుల్స్ ను కూడా టెస్ట్ చేయాలని సూచించారు. ఎక్కువగా ఆసుపత్రులకు వెళుతున్న ప్రాంతాల్లో కూడా టెస్టులు నిర్వహించాలని సూచించారు.

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం కంటామినెంట్ జోన్స్ లో మాత్రమే గడప గడపకూ టెస్టింగ్ లు చేస్తున్నారు. కేవలం కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి బయట ప్రపంచంతో అనుబంధాలు తెగిపోయి ఉంటాయని.. అక్కడ మాత్రమే ప్రతి ఒక్కరికీ టెస్టులు నిర్వహిస్తామని ఏప్రిల్ 17న అధికారులు తెలిపారు. పెద్ద పెద్ద నగరాల్లోని బఫర్ జోన్లలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని.. కోవిద్-19 ప్రబలుతున్న ప్రాంతంలో బిల్డింగ్స్, పరిసర ప్రాంతాలు, వీధులు పోలీసు స్టేషన్ పరిధి అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలన్నారు.

ఐసిఎంఆర్ సూచనలకు తగ్గట్టు కార్యాచరణ చేయడానికి చాలా ఆలస్యం అయిందని ఐసిఎంఆర్ టాస్క్ ఫోర్స్ మెంబర్ గతంలో వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ అన్నది ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే ప్రభుత్వం పలు చర్యలు తీసుకొని కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇప్పుడు గడప గడపకూ వెళ్లి సర్వే చేయడం అన్నది చాలా కష్టంతో కూడుకున్నదని అన్నారు. ఐసిఎంఆర్ చెప్పిన సూచనలు ఇలాంటి పరిస్థితుల్లో చేయడం హైబ్రిడ్ విధానంగా ఆయన అభివర్ణించాడు.

ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రలలో గడప గడపకూ సర్వే అన్నది చేపట్టారు కానీ.. పూర్తీ అవ్వలేదు. ఢిల్లీలో ఈ మధ్యనే మొదలైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని కన్ఫర్మ్ చేసింది. ఎవరికైతే కరోనా లక్షణాలు ఉంటాయో వారందరినీ హోమ్ క్వారెంటైన్ లో ఉంచనున్నారు. తీవ్ర లక్షణాలు ఉన్నవాళ్లను ఆసుపత్రులకు తీసుకుని వెళ్లనున్నారు.

- మృదుల చారి - నితిన్ సేథీ

Next Story