సచివాలయం విశాఖకు తరలింపు ముహూర్తం ఫిక్స్..!
By సుభాష్ Published on 2 Jan 2020 11:53 AM GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమరావతిలో ఉన్న సచివాలయం ఇప్పుడు మారనుంది. ఇప్పుడు మారనుంది. అమరావతి నుంచి విశాఖకు సచివాలయాన్ని తరలించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 6న సచివాలయాన్ని విశాఖకు తరలించాలని తేదీని ఖరారు చేసింది జగన్ సర్కార్. 6 నుంచే విశాఖలో సచివాలయానికి సంబంధించి పనులు జరగాలని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి ఆదేవాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక అంతకంటే ముందుగానే ఉద్యోగులను విశాఖకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలన రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపు కర్నూలును పరిపాలన రాజధాని చేయాలని కూడా డిమాండ్ ఉంది. ఎందుకంటే గతంలో మద్రాసు నుంచి విడిపోయిన సమయంలో కర్నూలు రాజధానిగా ప్రకటించారు. తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. అప్పటి నుంచి ఉన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. జగన్ మూడు రాజధానులు ప్రకటించగానే అమరావతిలో రైతులు దాదాపు 16 రోజుల పాటు ఆందోళనలు కొనసాగించారు. జీఎస్ రావు కమిటీ నివేదిక వచ్చినా..బీసీజీ కమిటీ రిపోర్టు రావల్సి ఉంది. ఈ రెండు నివేదికలు రాగానే దానిపై సర్కార్ ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ ఆ రెండు నివేదికలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోనుంది. అలాగే అసెంబ్లీలో ఈ విషయం చర్చించిన తర్వాత ముందుకెళ్లాలని భావిస్తోంది జగన్ సర్కార్.