ప్రభుత్వమే ఇసుక కొరత సృష్టించింది: సీపీఐ రామకృష్ణ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 8:45 AM GMT
ప్రభుత్వమే ఇసుక కొరత సృష్టించింది: సీపీఐ రామకృష్ణ

ముఖ్యాంశాలు

  • ఈ నెల 12 న వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ఇసుక మార్చ్‌
  • వెలుగు ఉద్యోగుల తొలగింపును ప్రభుత్వం విరమించుకోవాలి

విజయవాడ: ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. విజయనగరంలో పోలీసులు కుమ్మక్కై ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. 12వ తేదీన ఉచిత ఇసుకను ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ఇసుక మార్చ్‌ నిర్వహిస్తామని తెలిపారు. 13వ తేదీన వామపక్ష నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్‌ నిర్వహించాలని కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. వెలుగు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. తాము అధికారంలకి వస్తే ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉద్యోగాల కల్పనేమో.. కానీ ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.

Next Story