రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా..!

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆరా తీశారు. సమ్మె పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. వెంటనే రవాణ మంత్రి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే…రవాణా మంత్రి సీఎం సమీక్షలో ఉండటంతో గైర్హాజరయ్యారు. రాజ్‌ భవన్‌కు మంత్రికి బదులు రవాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి..13 రోజుల సమ్మెలో ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై గవర్నర్ తమిళి సైకి వివరించారు సునీల్ శర్మ.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.