అద్దంకి ఎమ్మెల్యే గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Dec 2019 4:49 PM ISTఅద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సంబంధించిన గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్, మైనింగ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండల పరిధిలోని ఈర్లకొండలో ఎమ్మెల్యేకు సంబందించిన క్వారీలలో నిన్నటి నుండి ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు సెలవు రోజైన ఆదివారం కూడా మూకుమ్మడిగా క్వారీల్లో సోదాలు చేశారు.
రవికుమార్‌కు చెందిన గోరంట్ల అంకమ్మచౌదరి, సాయిలక్ష్మి గ్రానైట్ క్వారీల్లో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు చేశారు. క్వారీల హద్దులను మరోసారి కొలతలు తీశారు. ఇప్పటి వరకూ వెలికి తీసిన రాయికి సంబంధించిన వివరాల రికార్డులను పరిశీలించారు. లోపాలను గుర్తించేందుకు అనుభవం ఉన్న అధికారులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ తనిఖీలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయోనన్న చర్చ నడుస్తోంది.