ఆ జీఓల సమాచారమేది? తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ప్రశ్న?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2019 6:46 AM GMT
ఆ జీఓల సమాచారమేది? తెలంగాణ సర్కార్ కు హైకోర్టు ప్రశ్న?

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు (GO) సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం జీఓ ల సమాచారాన్ని అందరికి అందుబాటులో ఉండే విధంగా సామాజిక మాధ్యమాలలో ఉంచట్లేదని పేరాల శేఖర్ రావు అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేసారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షకు పైగా జీఓ లు జారీచేస్తే 43, 462 జీఓ ల సమాచారాన్ని వెబ్ సైట్లలో పొందుపరచలేదని శేఖర్ రావు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ ను బుధవారం విచారణకు స్వీకరించిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రెవిన్యూ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Next Story