సచిన్ కుమార్తె శుభమన్ గిల్ భార్య అంటూ చూపిస్తున్న గూగుల్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Oct 2020 6:36 PM IST
రషీద్ ఖాన్ భార్య ఎవరు అంటే అనుష్క శర్మను గూగుల్ చూపించిన సంగతి తెలిసిందే..! తాజాగా మరో యువ క్రికెటర్ శుభమన్ గిల్ విషయంలో కూడా గూగుల్ అలాంటి పొరపాటే చేస్తోంది. సచిన్ కుమార్తె 'సారా టెండూల్కర్' గిల్ భార్య అని చూపిస్తూ ఉండడంతో అందరూ షాక్ అవుతూ ఉన్నారు. గతంలో శుభమన్‌గిల్, సారా డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా షికారు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు క్రికెటర్ శుభమన్‌గిల్ భార్య ఎవరు? అని గూగుల్‌లో సెర్చ్ చేయగా.. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అని చూపిస్తున్నది.
సారా టెండూల్కర్ ఇటీవల తన 23 వ పుట్టినరోజును జరుపుకుని చాలా మంది నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. శుభమాన్ గిల్ ఐపీఎల్ లో మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. సచిన్ కూడా గిల్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా గిల్, సారా డేటింగ్ లో ఉన్నారనే హింట్స్ కూడా ఇస్తున్నారేమోనని నెటిజన్లు చెబుతూ వస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ కు ఇంకా పెళ్లి అవ్వలేదు. కానీ గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అని సెర్చ్ చేస్తుంటే మాత్రం అనుష్క శర్మ అని చెబుతోంది. క్రికెట్ ప్రేమికులు ఈ సెర్చ్ రిజల్ట్ చూసి షాక్ అవుతూ ఉన్నారు. 22 ఏళ్ల రషీద్ ఖాన్‌కు అసలు పెళ్లే కాలేదు. గూగుల్ లో రషీద్ ఖాన్ భార్య ఎవరు అంటే కోహ్లీ సతీమణి పేరు ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు.
రషీద్ ఖాన్ 2018లో తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరోయిన్లు అనుష్క శర్మ, ప్రీతి జింతా అని చెప్పాడు. రషీద్ ఖాన్ ఫేవరెట్ ‘అనుష్క శర్మ’ అని వార్తలు వచ్చాయి. కానీ గూగుల్ సెర్చ్ లో మాత్రం రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అని చూపిస్తోంది.