టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఇబ్బంది పడుతున్న తమ ఉద్యోగులకు అదనంగా ఒక రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగులకు ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు గూగుల్‌ అవకాశం కల్పించినట్లు సీఎన్‌బీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా శుక్రవారం కూడా సెలవుదినంగా ప్రకటించింది. ఇది ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌లకు కూడా వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో శుక్రవారం పనిచేయాల్సి వస్తే.. వారు మరొక రోజును సెలవుగా తీసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. డే ఆఫ్‌ను కల్పించేందుకు మేనేజర్లు, వారి బృంద సభ్యులకు మద్దతుగా నిలవాలని గూగుల్ సూచించింది. వచ్చే ఏడాది మధ్య వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపే మొగ్గు చూపుతున్న తరుణంలోనే.. ఈ ఫోర్‌ డే వీక్‌ని కంపెనీ ప్రకటించింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దాదాపుగా అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాయి. అయితే.. వర్క్‌ప్రమ్‌ హోంలో పనిభారం, అవిశ్రాంత పని గంటల భారం పెరుగుతుందని, విశాంత్రి దొరకడం లేదని ఉద్యోగుల నుంచి గూగుల్‌ కి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో తమ ఉద్యోగుల కోసం గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *