తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్
By సుభాష్ Published on 7 Nov 2020 6:06 PM ISTతిరుమల భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. సర్వదర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలను పెంచుతున్నట్లు తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేవారు. తాజాగా విష్ణు నివాసం వసతి గృహంలోనూ టికెట్ల జారీని ప్రారంభించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌కు వచ్చే యాత్రికుల కోసం విష్ణు నివాసంలో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీ, కరోనా నేపథ్యంలో సర్వదర్శనం సమయం స్లాట్ టోకెన్ల సెంటర్లను పెంచింది.
కాగా, విష్ణు నివాసంలో 24 గంటల పాటు సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3 వేల నుంచి 10 వేల వరకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని పేర్కొంది. దర్శనం టికెట్లు ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తుండగా, సర్వదర్శనానికి సంబంధించి ఒక రోజు ముందుగానే టికెట్లను జారీ చేస్తున్నారు.