తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు శుభవార్త
By సుభాష్ Published on 12 April 2020 7:40 AM ISTదేశవ్యాప్తంగా కరోనాతో వణికిపోతోంది. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను సైతం మూసివేశారు. పదో తరగతి విద్యార్థుల పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక తెలంగాణ సర్కార్ పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థుల కోసం దూరదర్శన్ యాదగిరి ఛానల్‌లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 12 నుంచి (ఈరోజు) తరగతులు ప్రారంభం కానున్నాయి.
దీంతో విద్యార్థులు దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా డిజిటల్ పాఠాలను వీక్షించవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ పాఠాలు ప్రసారం అవుతాయని తెలిపింది. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. మిగతా సబ్జెక్టులను కూడా బోధించేలా టైమ్ టేబుల్‌ను రూపొందించారు. ఈ అవకాశాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.