రూ.13 కోట్ల విలువైన బంగారం పట్టివేత

By అంజి  Published on  2 Feb 2020 1:25 PM GMT
రూ.13 కోట్ల విలువైన బంగారం పట్టివేత

హైదరాబాద్‌: డీఆర్‌ఐ భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గడిచిన రెండు రోజుల్లో 30 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.13 కోట్ల విలువ చేసే బంగారాన్ని వివిధ రైల్వేస్టేషన్‌లలో స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Gold smuggling in Hyderabad

చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌, వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో బంగారాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్న 12 మందిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు బంగారాన్ని ముఠా సభ్యులు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. బంగారం వ్యాపారం ముఠాగా ఏర్పడి వివిధ నగరాల్లో స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

13 14

Next Story