భారీగా దిగొచ్చిన పుత్తడి బొమ్మ
By సుభాష్ Published on 19 April 2020 7:20 AM ISTబంగారు తల్లి దిగివస్తోంది. గత కొన్ని రోజులుగా పైచూపులు చూసిన పసిడి ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రోజురోజుకు క్షిణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం ధర వెలవెలబోతోంది. మరో వైపు వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1650 తగ్గి ప్రస్తుతం రూ.44,300లకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1500 తగ్గుతూ రూ.40,610 ఉంది. ఇక బంగారం బాటలో వెండి కూడా వెళ్తోంది. కిలో వెండి ధర రూ.700 తగ్గుతూ రూ.41,250కి పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం మూలంగా ధరలు దిగివస్తున్నాయని బులియన్న మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశ రాజధానిలో
ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1940 తగ్గుతూ రూ.41,950కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1940 తగ్గుదలతో రూ.44,660కి పడిపోయింది. వెండి కూడా అంతే.. కిలో వెండి రూ. 710 తగ్గుతూ ప్రస్తుతం రూ.41,190కి పడిపోయింది.
అంతర్జాతీయంలో..
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 2.16 శాతం దిగివచచి, 1700 డాలర్లకు క్షిణించింది. దీంతో ఔన్స్‌కు 1695.60 డాలర్లకు తగ్గింది. వెండి కూడా అంతే. వెండి ధర ఔన్స్‌కు 1.76 శాతం తగ్గుదలతో 15.35 డాలర్లకు పడిపోయింది.