తగ్గిన బంగారం ధరలు.. పెరిగిన వెండి ధరలు
By సుభాష్ Published on 18 Aug 2020 11:25 AM GMTబంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు మాత్రం పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.340 తగ్గి ప్రస్తుతం ధర రూ.55,320కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.310 తగ్గుతూ ప్రస్తుతం ధర రూ.50,700కు చేరుకుంది.
ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,090కి చేరుకోగా, అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,150కి చేరింది. ఇక వెండి ధర మాత్రం ఎగబాకింది. కిలో వెండిపై రూ.900 పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 68,900కు చేరుకుంది.
ఇంక అంతర్జాతీయంగా మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.30 శాతం పడిపోయింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1992 డాలర్లకు తగ్గింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా అదే దారిలో పయనిస్తోంది. వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుతూ 27.58 డాలర్లకు పడిపోయింది.
ఇక బంగారం ధరపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. గ్లోబల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. అలాగే నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ పెరగమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.