పెరిగిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 4:48 AM GMT
పెరిగిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

బంగారం కొనుగోలు చేయాలనే వారికి ఇది నిజంగా బ్యాడ్‌ న్యూస్‌. బంగారం ధర పరుగులు పెడుతోంది. వరుసగా మూడో రోజు బంగారం ధర పెరిగింది. కరోనా భయంతో వినియోగదారులు తగ్గినా ఇండియాలో మాత్రం పసిడి ధరలు పైపైకి వెలుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.470 పెరుగుదలతో రూ.48,980కు చేరింది. అదే క్ర‌మంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా ఏకంగా రూ.470 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.44,940కు ఎగసింది.

గోల్డ్‌ ధరలు మాదిరిగానే వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.48,300కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ.500 పెరుగుదలతో రూ.45,700కు ఎగ‌సింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర కూడా రూ.500 పెరిగి రూ.46,900కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.900 పెరిగి రూ.48,300కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story