ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో బంఫర్‌ ఆఫర్‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jun 2020 7:10 AM GMT
ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో బంఫర్‌ ఆఫర్‌..

టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రీపెయిడ్‌ వినియోగదారులకు డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిష్కన్‌ ను ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. ఈ ఆఫర్‌ కేవలం రూ.401 నెలవారి రీచార్జి ప్లాన్ లేదా రూ.2599 వార్షిక ప్లాన్ లేదా రూ.612, రూ.1208 డేటా వోచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్ ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్‌కు సంబందించి జియో తన ట్విట్టర్‌ ఖాతాలో ట్విట్‌ చేసింది.

రూ.401 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే 90జీబీ డేటా.. 3జీబీ చొప్పున 28 రోజుల పాటు వాడుకోవచ్చు కాగా.. మరో 6 జీబీ డేటా ఉచితం. వీటితో పాటు 28 రోజుల పాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్ పొందవచ్చు. జియో టు నాన్ జియో 1000 ఉచిత నిమిషాలు లభించనుండగా.. ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా లభించనుంది.

కాగా ఈ తరహా ఆఫర్ ను ఇప్పటికే ఎయిర్ టెల్ అందిస్తోంది. రూ.401తో రీచార్జి చేసుకునే వారికి ఏడాది పాటు డీస్నీ+హాట్ స్టార్ వీఐపీ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తోంది. ఎయిర్ టెట్ కు పోటీగా ఇప్పుడు జియో కూడా ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. హాట్‌స్టార్ యాప్‌లో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే దానికే రూ.399 అవుతుంది. ఈ క్ర‌మంలో జియో కేవ‌లం మ‌రో రూ.2 అద‌నంగా వేసి రూ.401కు ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందించడంతో పాటు 28 రోజుల పాటు రీచార్జీ ప్లాన్‌ను అందిస్తోంది.Next Story