దిగొచ్చిన బంగారం ధరలు

By సుభాష్  Published on  7 Jun 2020 2:28 AM GMT
దిగొచ్చిన బంగారం ధరలు

పసిడి కొనుగోలు దారులకు ఇది శుభవార్తే. బంగారం ఇప్పుడు నేల చూస్తోంది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ధర తగ్గుముఖం పట్టడంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక వెండి ధరకూడా అదే బాటలో పయనిస్తోంది.

హైదరాబాద్‌ మార్కెట్లో మూడో రోజుల్లో పసిడి ధర భారీగానే తగ్గుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.560 తగ్గుతూ ప్రస్తుతం రూ.44,750కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గి ప్రస్తుతం రూ.48,830 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. కిలో వెండి రూ.1650 తగ్గుతూ ప్రస్తుతం రూ.48,480కు క్షిణించింది.

ఇక ఢిల్లీ మార్కెట్లో వరుసగా ఐదో రోజు పసిడి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర తగ్గి, ప్రస్తుతం రూ.46,230కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000కు పడిపోయింది.

నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్‌ తగ్గడమే ధరల తగ్గుముఖానికి కారణమనివ బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

అలాగే గ్లోబల్‌ మార్కెట్లో బంగారం ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్రబ్యాంకుల వద్ద ఉన్నబంగారం నిల్వలు, జువెలరీ, వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది.

Next Story